సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో రానున్న ‘చౌకీదార్’

by సూర్య | Mon, Jun 17, 2024, 01:19 PM

దియా ఫేమ్ పృథ్వీ అంబర్, రథావర  దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘చౌకీదార్’ అనే టైటిల్ పెట్టారు. రోరింగ్ స్టార్ శ్రీమురళి, చంద్రశేఖర్ బండియప్ప 6వ సారి క‌లిసి చేస్తున్న ప్రాజెక్ట్‌కు, అభినందనలు తెలుపుతూ "చౌకీదార్" టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రం క‌న్న‌డ‌తో పాటు తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. "చౌకీదార్' అనే టైటిల్‌ను బట్టి ఇది మాస్ మూవీ అని అనుకోవ‌ద్ద‌ని ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అన్నారు. చంద్రశేఖర్ బండియప్ప  తన ప్రతి సినిమాలోనూ సరికొత్త కథతో అలరిస్తారు.  'అనే పాటకి'లో కామెడీ, 'రథావర'లో కల్ట్ థీమ్స్, 'తారకాసుర'లో యూనిక్ కథాంశం, 'రెడ్ కాలర్'లో క్రైమ్ థ్రిల్లర్, 'కౌస్తి'లో కోస్టల్ డ్రామా. పృథ్వీ, చంద్రశేఖర్ బండియప్ప సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని విద్యా శేఖర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్లహళ్లి చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా, వి.నాగేంద్రప్రసాద్, ప్రమోద్ మరవంటే లిరిక్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక సిబ్బందిని మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయ‌నున్నారు. 

Latest News
 
'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ అవుట్ Sat, Oct 26, 2024, 06:58 PM
బిగ్ బాస్ 18లో 'సింఘమ్‌ ఎగైన్' ని ప్రమోట్ చేస్తున్న అజయ్ దేవగన్ Sat, Oct 26, 2024, 06:53 PM
తన పెళ్లి ప్లాన్స్ గురించి ఓపెన్ అయ్యిన రాశి ఖన్నా Sat, Oct 26, 2024, 06:47 PM
నీక్‌లో తన పాత్ర ఎలా వచ్చిందో వెల్లడించిన ప్రియాంక మోహన్ Sat, Oct 26, 2024, 06:41 PM
'కంగువ' వైజాగ్ ప్రమోషన్ మీట్ డీటెయిల్స్ Sat, Oct 26, 2024, 06:36 PM