శ్యామ్ సెల్వన్ హీరోగా చిత్రం ప్రారంభం

by సూర్య | Mon, Jun 17, 2024, 01:20 PM

ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ చంద్ర మనవడు 'శ్యామ్ సెల్వన్ ను హీరోగా పరిచయం చేస్తూ.. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "నిమ్మకూరు మాస్టారు. జె.ఎమ్.సినీ ఫ్యాక్టరీ పతాకంపై యువ నిర్మాత జె.ఎమ్.ప్రదీప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అముదేశ్వర్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రంలోని అన్ని పాటలకు ప్రముఖ కవి, గీత రచయిత జొన్నవిత్తుల సాహిత్యం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరిగింది. రాజేంద్ర ప్రసాద్ సహా యూనిట్ సభ్యులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్.. హీరో శ్యామ్ సెల్వన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాధవపెద్ది సురేష్ చంద్ర, గీత రచయిత జొన్నవిత్తుల, చిత్ర కథానాయకుడు శ్యామ్ సెల్వన్, నిర్మాత జె.ఎమ్.ప్రదీప్, దర్శకుడు అముదేశ్వర్ పాల్గొని చిత్ర విశేషాలు వెల్లడించారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM