కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోషూట్ !

by సూర్య | Sat, Oct 26, 2024, 04:17 PM

నటనపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసింది కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అపోలో ఆసుపత్రిలో డాక్టర్ గా వైద్య సేవలు అందించిన ఆ అమ్మాయి..ఇప్పుడు వెండితెరపై అందం, అభినయంతో అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.కామాక్షి భాస్కర్ల.. 2018లో మిస్ తెలంగాణగా నిలిచింది. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి మెల్లిగా అవకాశాలను ఒడిసి పట్టుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ప్రియురాలు అనే తో తెలుగు తెరకు పరిచయమైంది.ఈ తోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ వయ్యారి.. మా ఊరి పొలిమేర తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరూపాక్ష, పొలిమేర 2 చిత్రాల్లో నటించింది. ఇటీవల సూపర్ హిట్ అయిన ఓం భీమ్ బుష్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. నటనకు ఆస్కారం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంటుంది.ఇటీవలే వచ్చిన మా ఊరి పొలిమేర 2, పొలిమేర 2 చిత్రాలు ఈ బ్యూటీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్.నిత్యం ఏదోక ఫోటోషూట్ షేర్ చేస్తుంటుంది. అటు ట్రెడిషనల్.. ఇటు మోడ్రన్ లుక్కులో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Latest News
 
తన పెళ్లి ప్లాన్స్ గురించి ఓపెన్ అయ్యిన రాశి ఖన్నా Sat, Oct 26, 2024, 06:47 PM
నీక్‌లో తన పాత్ర ఎలా వచ్చిందో వెల్లడించిన ప్రియాంక మోహన్ Sat, Oct 26, 2024, 06:41 PM
'కంగువ' వైజాగ్ ప్రమోషన్ మీట్ డీటెయిల్స్ Sat, Oct 26, 2024, 06:36 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'క' ట్రైలర్ Sat, Oct 26, 2024, 06:32 PM
'మట్కా' లో నాని బాబుగా కన్నడ కిషోర్ Sat, Oct 26, 2024, 06:27 PM