కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'సత్యభామ'

by సూర్య | Thu, May 23, 2024, 03:20 PM

సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'సత్యభామ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా జూన్ 7, 2024న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. మేజర్ మరియు గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఔరుమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM