విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...!

by సూర్య | Mon, Oct 21, 2024, 07:47 PM

 యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లకు ఆగష్టు 8వ తేదీన నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.ఇందుకు సంబంధించిన పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. శోభిత తన ఇన్ స్టాలో ఫోటోలు పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.శోభిత పసుపు దంచుతున్న ఫొటోలు.. సంప్రదాయబద్ధంగా జరుగుతున్న మరిన్ని ఫొటోలు ఆమె షేర్ చేసుకున్నారు. 'గోధుమరాయి పసుపు దంచడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయ'ని ఆమె రాసుకొచ్చారు. ఎరుపు, గోధుమ రంగు కలిసిన చీరలో శోభిత మెరిసిపోతున్నారు. దీంతో అభిమానులు శోభిత-నాగచైతన్యకు శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజెస్ చేస్తున్నారు. మరికొందరు.. వెడ్డింగ్ డేట్ ఎప్పుడు.. వెడ్డింగ్ ఎక్కడో చెప్పాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇటివలే నాగచైతన్య-శోభిత ట్రెండీ లుక్ లో కలిసిన ఫొటో నెట్టింట బాగా వైరల్ అయింది. కెరీర్ పరంగా నాగచైతన్య తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు. 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయిన శోభిత ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM