'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్

by సూర్య | Mon, Oct 21, 2024, 07:31 PM

సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణు గోపాల్ రెడ్డి నిర్మించిన భారీ అంచనాల చిత్రం "లగ్గం" కి రమేష్ చెప్పాల రచించి, దర్శకత్వం వహించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు అంటే అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లోని హోటల్ దసపల్లా లో ఈవెంట్ ని నిర్వహిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సాయి రోనక్ మరియు ప్రజ్ఞా నగ్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రాచ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రమ్ శీను, సంధ్యా గంధం, టి.సుగుణ, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి, కంచెరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజి బాబు, ఆర్ ఎస్ నంద, కిరీటి ఈ చిత్రంలో కీలక పత్రాలు నటిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్, బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్, కృష్ణ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది.

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM