100M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'సుందరం మాస్టర్'

by సూర్య | Wed, May 22, 2024, 06:35 PM

కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో కమెడియన్ హర్ష చెముడు నటించిన సుందరం మాస్టర్ సినిమా యొక్క OTT రైట్స్ ని ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారం ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా మార్చి 28న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా 100 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో నటి దివ్య శ్రీపాద ఒక ప్రముఖ పాత్రలో నటించారు. RT టీమ్‌వర్క్స్ మరియు గోల్‌డెన్ మీడియా పతాకంపై రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ప్రభాస్ తో మల్టీస్టారర్ మూవీలో నటిస్తా: దుల్కర్ సల్మాన్ Tue, Oct 22, 2024, 01:02 PM
స్వీయ వివాహం చేసుకున్న స్టార్ పాప్ సింగర్ Tue, Oct 22, 2024, 11:53 AM
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM