'ఆయ్' నుండి రంగనాయకి సాంగ్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Wed, May 22, 2024, 06:33 PM

టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ కొత్త దర్శకుడు అంజి కంచిపల్లి తో తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆయ్’ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. బన్నీ వాస్‌తో పాటు విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ రంగనాయకి ప్రోమోని రేపు 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పూర్తి పాటని మే 25, 2024న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో నయన్ సారిక కథానాయికగా నటించింది. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానున్నది. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM