'భలే ఉన్నాడే' టీజర్ విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Sat, May 04, 2024, 03:24 PM

మారుతీ దర్శకత్వంలో రాజ్ తరుణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'భలే ఉన్నాడే' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని మే 5, 2024న సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, యు అండ్  ఐ హలో వరల్డ్ వంటి అనేక విజయవంతమైన వెబ్ షోలను అందించిన నూతన దర్శకుడు జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాస్, అమ్ము అభిరామి, లీలా శాంసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.


శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమాని రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా ఎన్.వి.కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పిస్తుంది.

Latest News
 
'దేవర' నుండి ఫియర్ సాంగ్ ప్రోమో అవుట్ Fri, May 17, 2024, 07:46 PM
త్వరలో 'NBK109' సెట్స్‌లో జాయిన్ కానున్న బాలకృష్ణ Fri, May 17, 2024, 07:43 PM
TFDA కార్యక్రమంలో చిరు, ప్రభాస్ మరియు అల్లు అర్జున్ Fri, May 17, 2024, 07:40 PM
ఓపెన్ అయ్యిన 'టర్బో' అడ్వాన్స్ బుకింగ్స్ Fri, May 17, 2024, 07:35 PM
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM