రికార్డు ధరకు అమ్ముడయిన 'పుష్ప 2' OTT రైట్స్

by సూర్య | Thu, Apr 18, 2024, 04:28 PM

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2019లో బ్లాక్‌బస్టర్ మూవీస్ లో ఒకటైన పుష్ప: ది రైజ్‌కి సీక్వెల్ గా పుష్ప 2: ది రూల్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇటీవలే మూవీ మేకర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప 2 యొక్క పవర్-ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేసారు.


టీజర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం 275 కోట్లకి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆగష్టు 15, 2024న విడుదల కానుంది.


ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, సునీల్, జగదీష్ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Latest News
 
సంచలనం రేపుతున్న యాంకర్‌ రష్మి పోస్ట్ Wed, May 01, 2024, 01:58 PM
స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న 'సిద్దర్ద్ రాయ్' Wed, May 01, 2024, 12:27 PM
హృతిక్ రోషన్ తొలి క్రష్ : మాళవిక మోహనన్ Wed, May 01, 2024, 12:25 PM
నవీన్ చంద్రను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు Wed, May 01, 2024, 10:19 AM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM