తేజ సజ్జా తదుపరి చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్ లాక్

by సూర్య | Thu, Apr 18, 2024, 02:39 PM

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఆసక్తికరమైన గ్లింప్సె ని ఆవిష్కరించారు. మిరాయ్ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమా కథ చైనా మరియు జపాన్ సరిహద్దులో ఒక మనిషిని దేవుడి స్థాయికి చేర్చే శక్తి కలిగిన తొమ్మిది పవిత్ర గ్రంథాలను రక్షించే ఏకైక బాధ్యత కలిగిన ఒక పోరాట యోధుడి చుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమా ఏప్రిల్ 18, 2025న పెద్ద స్క్రీన్‌లపై 2D మరియు 3D ఫార్మాట్‌లలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ మరియు చైనీస్ భాషలలో విడుదల కానుంది. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ అడ్వెంచరస్ మూవీలో హాయ్ నాన్న నటి రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను గౌర హరి అందించనున్నారు.


కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తుండగా, టిజి విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు.

Latest News
 
స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న 'సిద్దర్ద్ రాయ్' Wed, May 01, 2024, 12:27 PM
హృతిక్ రోషన్ తొలి క్రష్ : మాళవిక మోహనన్ Wed, May 01, 2024, 12:25 PM
నవీన్ చంద్రను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు Wed, May 01, 2024, 10:19 AM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM