'హనుమాన్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్

by సూర్య | Wed, Apr 17, 2024, 05:14 PM

పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన సూపర్ హీరో సినిమా 'హను-మాన్' లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం జనవరి 12, 2024న వెండితెరపైకి వచ్చింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది. తాజా సమచారం ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 28న సాయంత్రం 5:30 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటిస్తుంది. ఈ సినిమాలో  వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జై క్రిష్ మరియు కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందిస్తున్నారు. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హను-మాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM
'యోధ' డిజిటల్ ఎంట్రీ ఎప్పుడంటే...! Tue, Apr 30, 2024, 06:07 PM
'తాండల్' సెట్స్ లో నాగ చైతన్య Tue, Apr 30, 2024, 06:05 PM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Tue, Apr 30, 2024, 06:04 PM