'తాండల్' సెట్స్ లో నాగ చైతన్య

by సూర్య | Tue, Apr 30, 2024, 06:05 PM

చందూ మొండేటితో నాగ చైతన్య తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి "తాండల్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు. ఈ సినిమా సెట్స్ నుండి కొన్ని పిక్స్ ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది.

ఈ లవ్-యాక్షన్ డ్రామాలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో చై మత్స్యకారునిగా కనిపించనున్నారు. ఈ చిత్రం 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి స్ఫూర్తిని పొందింది. GA2 పిక్చర్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'సాలార్ 2' లో మలయాళ నటుడి కీలక పాత్ర Fri, May 17, 2024, 06:57 PM
మంచి ఓపెనింగ్స్ సాధించిన 'గురువాయూర్ అంబలనాడయిల్' Fri, May 17, 2024, 06:52 PM
విజయ్ 'ది గోట్' కోసం పని చేసుతున్న ప్రఖ్యాత VFX కంపెనీ Fri, May 17, 2024, 06:48 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'డెవిల్' Fri, May 17, 2024, 06:44 PM
మిరాయి : మంచు మనోజ్ ఫస్ట్ లుక్ విడుదలకి తేదీ లాక్ Fri, May 17, 2024, 06:40 PM