'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు

by సూర్య | Tue, Apr 30, 2024, 06:04 PM

గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'దేవకీ నందన వాసుదేవ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ఏమయ్యిందే అనే టైటిల్ తో మే 3న విడుదల కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ అందించగా, ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రంలో అశోక్ సరసన వారణాసి మానస జోడిగా నటిస్తుంది. లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ (సినిమా డిస్ట్రిబ్యూటర్‌) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ప్రముఖ స్వరకర్త భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Latest News
 
'గం గం గణేశ' ట్రైలర్ అవుట్ Mon, May 20, 2024, 06:33 PM
50 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న 'క్రూ' Mon, May 20, 2024, 06:30 PM
రత్నం నుండి 'ఎటువైపో' వీడియో సాంగ్ అవుట్ Mon, May 20, 2024, 06:28 PM
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Mon, May 20, 2024, 06:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'సింహాద్రి' Mon, May 20, 2024, 06:23 PM