'బై వన్ గెట్ వన్' ఆఫర్‌ను ప్రకటించిన 'మైదాన్' బృందం

by సూర్య | Sat, Apr 13, 2024, 11:22 AM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ నటించిన 'మైదాన్' సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఈ స్పోర్ట్స్ డ్రామా గురువారం పెయిడ్ ప్రివ్యూలతో కలిపి 7.25 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరవేయాలనే ఉద్దేశ్యంతో మూవీ మేకర్స్ BOGO (బయ్ వన్ గెట్ వన్) ఆఫర్‌ను ప్రకటించారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.


అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతదేశపు లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్. ఈ సినిమాలో ప్రియమణి అజయ్ దేవగన్ భార్యగా నటించింది. బోనీ కపూర్ ఈ జీవిత చరిత్ర చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి AR రెహమాన్ స్వరాలు సమకూర్చారు.

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM