చీరకట్టులో అనుపమ అదరహో !

by సూర్య | Sat, Apr 13, 2024, 10:48 AM

మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది.అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. ఇక నిర్మాత, బయ్యర్లకు భారీ లాభాలు ఖాయం అంటూ అంచనా వేస్తున్నారు. గతంలో తెలుగు ఆడియన్స్ చూసిన అనుపమ వేరు.. ఈ చిత్రంలో కనిపించిన అనుపమ కంప్లీట్ గా వేరు. రొమాన్స్, గ్లామర్ షోతో ఈ చిత్రంలో అనుపమ యువతని ఉర్రూతలూగించింది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అచ్చ తెలుగు అమ్మాయి తరహాలో ప్రేక్షకులని ఆకట్టుకుంది. నటన పరంగా అనుపమకి వంకలు పెట్టలేం. అంతటి చక్కటి అభినయం గల నటి ఆమె. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది.   కార్తికేయ 2 చిత్రంలో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది. అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం.   తాజాగా అనుపమ రెడ్ కలర్ చీరకట్టులో అదరహో అనిపించే ఫోజులు ఇచ్చింది. చిరునవ్వులు చిందిస్తూ అనుపమ క్రేజీగా ఫోజులు ఇచ్చింది. చీర కట్టులో ఆమె లుక్ ఎంతో బ్యూటిఫుల్ గా ఉందని చెప్పొచ్చు. ఈ ఫోటోలకు అనుపమ ఆనందం అంటూ కామెంట్ పెట్టింది. టిల్లు స్క్వేర్ చిత్రం 100 కోట్లు సాధించినందుకేనా ఈ ఆనందం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 



 


 

Latest News
 
విశాఖపట్నంలో పెళ్లి పనులు మొదలుపెట్టిన శోభిత...! Mon, Oct 21, 2024, 07:47 PM
ఓటీటీలోకి వేట్టయన్ ? Mon, Oct 21, 2024, 07:43 PM
ప్రభాస్ లుక్ రిలీజ్ ! Mon, Oct 21, 2024, 07:40 PM
నాని 13 ఏళ్ల క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ Mon, Oct 21, 2024, 07:37 PM
'లగ్గం' ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ Mon, Oct 21, 2024, 07:31 PM