ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం

by సూర్య | Fri, Mar 29, 2024, 12:01 PM

ఫైన‌ల్‌గా సౌత్ ఇండియాస్‌ మోస్ట్ ఎవైటెడ్ మూవీకి సంబంధించిన కీల‌క అప్డేట్ ఎట్ట‌కేల‌కు వ‌చ్చింది. గ‌త కొంత‌కాలంగా వార్త‌ల్లో ఉంటూ వ‌స్తున్న ర‌జ‌నీకాంత్ , లోకేశ్ క‌న‌క‌రాజ్ కాంబినేష‌న్ మూవీ ప‌ట్టాలెక్కింది. (Thalaivar 171)గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా గురించి దాదాపు ఆరు నెలుగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గా ఇన్నాళ్లకు ఓ క్లారిటీ రావ‌డంతో ర‌జ‌నీకాంత్‌, లోకేశ్ ఫ్యాన్స్ అనందంలో మునిగి తేలుతున్నారు. తాజాగా గురువారం ఈ  చిత్రానికి సంబంధించి లోకేశ్ క‌న‌క‌రాజ్ త‌న సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్‌ను పోస్టు చేస్తూ ఏప్రిల్ 22న టైటిల్ రివీల్ చేస‌య‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ పోస్ట‌ర్‌లో లగ్జరీ వాచ్‌లను బేడీలుగా చేతికి క‌ట్టేసిన స్టిల్‌లో 1980ల నాటి వింటేజ్‌ రజినీకాంత్ త‌ర‌హాలో లుక్‌ అదిరిపోయింది. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోండ‌గా లారెన్స్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం, అన్బ్ ర‌వి ఫైట్స్ అందిస్తున్నారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM