నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’

by సూర్య | Fri, Mar 29, 2024, 12:03 PM

మాములుగా హాలీవుడ్ చిత్రాల‌కు ఉండే క్రేజ్ స‌ప‌రేటు.. న‌చ్చితే సొంత లాంగ్వేజ్ సినిమాల‌కు మించి క‌లెక్ష‌న్లు ముట్ట‌జెబుతారు. ఈ విష‌యం ఇప‌ప‌ప్టికే చాలా సినిమాల విష‌యంలో రుజువైంది కూడా. ఇప్పుడు ఇదే కోవ‌లో ఇప్పుడు ఓ చిత్రం రాబోతుంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ మాత్ర‌మే. ఎన్న‌డు లేనంత‌గా చాలా మంది ప్రేక్ష‌కులు ఈ చిత్రం విడుద‌ల కోసం వెయిట్ చేస్తున్నారు. గ‌తంలో అవెంజ‌ర్స్ ఎండ్‌గేమ్ సినిమాకు ఎలా అయితే అభిమానులు ఎదురు చూశారో ఇప్పుడు అంత‌కుమించి అనేలా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగ‌ర్లీ వెయిట్ చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు. గ‌త వారం ప‌దిరోజులుల‌గా ఈ సినిమాపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ వీప‌రీతంగా న‌డుస్తోండ‌గా యూట్యూబ్‌లో అయితే వేలు, ల‌క్ష‌ల్లోనే వీడియోలు పెడుతున్నారు ఫ్యాన్స్‌. అయితే.. హాలీవుడ్‌ చిత్రాల్లో ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఈ తరహా చిత్రాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆదరిస్తారు. ఈ సిరీస్‌ల‌లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాలు కాసుల వర్షం కురిపించాయి. అదే వ‌రుస‌లో ఇప్పుడు వస్తున్న మరో భారీ చిత్రం ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌ - ది ఎంపైర్‌’ మూవీ. శుక్ర‌వారం న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. గ‌త చిత్రాల‌కు మిన్న‌గా యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్ సీన్స్ ఈ సినిమాలో ఉంటుండ‌గా , గాడ్జిల్లాను మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్‌గా చూయించ‌నున్నారు. అలాంటి గాడ్జిల్లాను ఎదుర్కొవ‌డానికి కాంగ్ చేసే పోరాటాలు, మ‌ధ్య‌లో సైంటిస్టులు కాంగ్‌కు సాయంగా రావ‌డం త‌దిత‌ర ఆస‌క్తి అంశాల‌తో సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాకు ఆడమ్‌ వింగార్డ్‌ దర్శకత్వం వహించగా, లెజెండరీ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. ఈ చిత్రంలో రెబెకా హాల్‌, బ్రియాన్‌ టైరీ హెన్రీ, డాన్‌ స్టీవెన్స్‌, కైలీ హాట్లీ, అలెక్స్‌ ఫెర్న్స్‌, ఫలచెన్‌ తదితరులు నటించారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM