'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన

by సూర్య | Wed, May 08, 2024, 08:38 PM

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాకి 'కుబేర' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమానుండి నాగార్జున యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ యూట్యూబ్ లో 3 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృదం సోషల్ మీడియాలో సరికొత్త వీడియోని విడుదల చేసి ప్రకటించింది.

ఈ ప్రాజెక్ట్‌లో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రను పోషించనుంది. అక్కినేని నాగార్జున, జిమ్ సర్భ్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నికేత్ బొమ్మి ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సహకారంతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యొక్క యూనిట్), సోనాలి నారంగ్ సమర్పణలో ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
పవన్ ఫ్యాన్స్ పై రేణు దేశాయ్ ఫైర్ Sun, May 19, 2024, 09:25 AM
10 వేల మందితో 'కంగువా' వార్ సీన్ షూట్ Sun, May 19, 2024, 09:24 AM
'టర్బో' ఫ్రెంచ్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, May 18, 2024, 06:20 PM
'హౌస్‌ఫుల్ 5' లో బాలకృష్ణ విలన్‌ Sat, May 18, 2024, 06:18 PM
దర్శకుడిగా మారిన ప్రముఖ కొరియోగ్రాఫర్ Sat, May 18, 2024, 06:16 PM