ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా

by సూర్య | Fri, Mar 29, 2024, 12:00 PM

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా.. ఎన్నో అంచ‌నాల న‌డుమ శివ‌రాత్రి పండుగ‌ను పురస్క‌రించుకుని మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం ‘భీమా’  ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. అవుట్ అండ్ మాస్ ,యాక్ష‌న్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కన్నడ దర్శకుడు ఏ హర్ష ద‌ర్శ‌క‌త్వం వహించ‌గా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. కేజీఎఫ్‌, సలార్ చిత్రాల‌ ఫేమ్‌ రవి బస్రూర్‌ సంగీతం అందించాడు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. A సెంట‌ర్ల‌లో అంత‌గా ప్ర‌భావం చూప‌ని ఈ సినిమా B సెంట‌ర్ల‌లో మాత్రం అదిరిపోయే క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. ముఖ్యంగా ఫైట్ సాక్వెన్స్‌ను అభిమానులు బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్ ద‌క్కించుకోగా ఒప్పందానికి ముందే 25 రోజుల్లోనే చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకు వ‌స్తున్నారు. ఏప్రిల్ 5 శుక్ర‌వారం నుంచి స్ట్రీమింగ్ చేయ‌నుండ‌గా ఇత‌ర సౌత్ భాష‌ల్లోనూ అందుబాటులోకి రానుంది.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ప్రతినిధి 2' బుకింగ్స్ Wed, May 08, 2024, 08:45 PM
'టర్బో' మలేషియా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Wed, May 08, 2024, 08:43 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'బైసన్' Wed, May 08, 2024, 08:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్పందన Wed, May 08, 2024, 08:38 PM
విడుదల తేదీ ని లాక్ చేసిన 'భజే వాయు వేగం' Wed, May 08, 2024, 06:45 PM