'సాలార్' ట్రైలర్ అవుట్

by సూర్య | Fri, Dec 01, 2023, 08:17 PM

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సాలార్ నిర్మాతలు ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన ఇద్దరు స్నేహితుల కథ. ట్రైలర్ ప్రేక్షకుల ని భారీగా ఆకట్టుకుంటుంది.


మూడున్నర నిమిషాల పాటు సాగే ఈ ట్రైలర్‌లో సినిమాలోని కీలక పాత్రలను చక్కగా పరిచయం చేశారు. అలాగే సాలార్‌లో మంచి ఎమోషన్స్‌ ఉంటాయని ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది.

డిసెంబర్ 22, 2023 న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో జపపతి బాబు, తిను ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు మరియు సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన సాలార్ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM