ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు

by సూర్య | Fri, Sep 20, 2024, 08:10 PM

శివ కోరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'దేవర' అనే టైటిల్ ని లాక్ చేసారు. 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో "దేవర: పార్ట్ 1" ఒకటి. ఈ సినిమా సాంగ్స్ మరియు ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసాయి. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని సెప్టెంబర్ 22న హైదరాబాద్ లోని నోవెటల్ లో సాయంత్రం 6 గంటలకి నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తారక్ పొన్నప, శృతి మురాతి, వంశి, శ్రీను, హిమజ కీలక పాత్రలో నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న "దేవర: పార్ట్ 1" ఎపిక్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలుస్తుంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Latest News
 
రష్మిక–విజయ్ పెళ్లి ఫిక్స్: వచ్చే నెలనే వధూవరులు! Mon, Jan 19, 2026, 10:40 PM
శ్రీలీల చేజారిన 'అనగనగ ఒక రాజు' Mon, Jan 19, 2026, 07:21 PM
బాలీవుడ్ పీఆర్ వ్యూహాలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు Mon, Jan 19, 2026, 07:20 PM
నయనతార, త్రిషల మధ్య 23 ఏళ్ల స్నేహబంధం Mon, Jan 19, 2026, 07:19 PM
వరుణ్ తేజ్, నిహారిక చిన్ననాటి ఫోటో వైరల్ Mon, Jan 19, 2026, 07:18 PM