ప్రేమ పేరుతో చేసే పనులకి చివరికి ఏమౌతుందో , అదే ఈ సినిమా

by సూర్య | Tue, Sep 26, 2023, 01:19 PM

మనిదన్‌ సినీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మలా దేవి జయమురుగన్‌ నిర్మాణ సారథ్యంలో టీఎం జయమురుగన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘తీ ఇవన్‌’. ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు కార్తీక్‌, సుకన్య, సన్నీ లియోన్‌ ప్రధాన పాత్రలను పోషించారు. వీరితో పాటు సేతు అభిత, మస్కార, యువరాణి, రాధారవి, ఇళవరసు, జాన్‌ విజయ్‌, సింగం పులిం, శరవణ శక్తి, సుమన్‌, హేమంత్‌, శ్రీధర్‌ తదితరులు నటించారు. ఈ చిత్ర ఆడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ... ‘పరాశక్తి’, ‘మామన్నన్‌’ తరహాలో సామాజిక దృక్పథంతో తెరకెక్కించాం. హీరో కార్తీక్‌... తన నటనా విశ్వరూపాన్ని మరోమారు చూపించారు. ఒక కుటుంబంలో యువతీ లేదా యువకుడు.. సంస్కృతి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రేమ పేరుతో లేచిపోవడం, పెళ్ళికి ముందే గర్భం దాల్చడం, సహజీవనం చేయడం, పెళ్ళికి ముందే వివాహేతర సంబంధం పెట్టుకోవడం వంటి చెడు పనుల వల్ల ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు మాత్రమే కాకుండా ఆ యువతీయువకుల జీవితాలు కూడా సమాధి అవుతాయన్న సందేశంతో తెరకెక్కించాం. ఇందులో ఏడు పాటలు ఉండగా, ఒకటి సన్నీలియోన్‌ ఐటమ్‌ సాంగ్‌. కుటుంబ సమేతంగా చూసే సినిమా. చెన్నై, పొల్లాచ్చి, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో మూడు షెడ్యూల్స్‌లో సినిమా షూటింగ్‌ పూర్తి చేసి, వచ్చే నెలలో విడుదల చేస్తామని తెలిపారు. కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు సమకూర్చడమే కాకుండా, సంగీత స్వరాలు అందించిన జయమురుగన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కెమెరా వైఎన్‌ మురళి. ఎడిటింగ్‌ మహ్మద్‌ ఇత్రిస్‌, నేపథ్య సంగీతం ఏజే అలీ మిశ్రా.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM