నాకు ఎటువంటి ఇబ్బంది లేదు

by సూర్య | Wed, Sep 18, 2024, 05:52 PM

తమిళ చిత్రసీమలో ఎన్నడు కూడా హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురైన సందర్భాలు ఎక్కడా కనిపించలేదని అందువల్ల మలయాళ చిత్రపరిశ్రమలో ఏర్పాటు చేసినట్టుగా జస్టిస్‌ హేమ కమిషన్‌ ఇక్కడ అక్కర్లేదని హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్ అభిప్రాయ పడ్డారు. చెన్నైలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశాలు ఎక్కడా చోటు చేసుకోలేదు. ఈ విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను. తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషా చిత్రాల్లో నేను నటించాను. నేను ఏనాడు కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోలేదని అన్నారు.అందువల్ల జస్టిస్‌ హేమ కమిషన్ ఇక్కడ అక్కర్లేదన్నది నా వ్యక్తిగత భావన అని. తమిళ చిత్రపరిశ్రమ సాఫీగా సాగిపోతుంది. మహిళల భద్రత చాలా ముఖ్యం. ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి’ అని పేర్కొన్నారు.

Latest News
 
'భూల్ భూలయ్యా 3' ట్రైలర్ అవుట్ Thu, Oct 10, 2024, 04:07 PM
విశ్వం : మిమర్స్ తో మాజా FT శ్రీనువైట్ల ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 10, 2024, 04:03 PM
'పోటెల్' నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Oct 10, 2024, 03:57 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'గొర్రె పురాణం' Thu, Oct 10, 2024, 03:52 PM
ప్రశాంత్ వర్మ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Thu, Oct 10, 2024, 03:48 PM