రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది

by సూర్య | Wed, Sep 18, 2024, 05:53 PM

సమయం, సందర్భం, పరిస్థితులు అనుకూలిస్తే రాజకీయాల్లోకి వస్తానని, తన సిద్ధాంతాలతో ఏకీభవించే పార్టీలో కలిసి పనిచేస్తానని ప్రముఖ జౌళి వ్యాపారవేత్త, హీరో ‘లెజెండ్‌’ శరవణన్ అన్నారు. ఆయన నటించే కొత్త చిత్రం తూత్తుకుడిలో ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయన చెన్నై నుంచి తూత్తుక్కుడి వెళ్ళారు.ఈ సందర్భంగా చెన్నై ఎయిర్‌పోర్టులో ‘లెజెండ్‌’ శరవణన్ మీడియాతో మాట్లాడుతూ, ‘నేను ఎల్లవేళలా ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేస్తూ, శ్రద్ధ వహిస్తాను. సమయం, వాతావరణం, పరిస్థితులు అనుకూలిస్తే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను. 2026లో జరిగే ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుంది. నా సిద్ధాంతాలతో ఏకీభవించే పార్టీలతో కలిసి పనిచేస్తాను. ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని నగరానికి చేరుకోవడం సంతోషం. ఇకపోతే, నా కొత్త చిత్రానికి ఇటీవ‌ల సూరితో గ‌రుడ‌న్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన‌ దురై సెంథిల్‌ కుమార్ దర్శకత్వంలో, జిబ్రాన్ సంగీతంలో ఓ చిత్రం చేస్తున్నాన‌ని, ఈ మూవీలో చాలా మంది నటీనటులు ఉంటార‌న్నారు. తూత్తుక్కుడితో పాటు ఉత్తర భారతం, విదేశాల్లో సినిమాను చిత్రీకరించనున్నామ‌ని, వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే యేడాది ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నామ‌న్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కించే ఈ చిత్రానికి టైటిల్‌ను త్వరలోనే ఖరారు చేస్తాం’ అని వివరించారు.

Latest News
 
'దేవర 2' షూటింగ్ ఈ సమయంలో ప్రారంభం కానుందా? Thu, Oct 10, 2024, 05:12 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'మా నాన్న సూపర్ హీరో' Thu, Oct 10, 2024, 05:05 PM
త్వరలో నిర్మాణాన్ని ప్రారంభించనున్న పా రంజిత్ యొక్క 'వెట్టువం' Thu, Oct 10, 2024, 04:59 PM
ఇంస్టాగ్రామ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' సెకండ్ సింగల్ Thu, Oct 10, 2024, 04:54 PM
క్రికెటర్‌గా మారిన పవన్ కళ్యాణ్ Thu, Oct 10, 2024, 04:47 PM