మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు

by సూర్య | Tue, Sep 26, 2023, 01:06 PM

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.  ‘బాహుబలి’ పాత్రధారి ప్రభాస్‌ మైనపు విగ్రహాన్ని మేడమ్‌ టుస్సాడ్స్‌లోనూ ఏర్పాటు చేశారు. తాజాగా మైసూర్‌లోని ఓ మ్యూజియంలోనూ అమరేంద్ర బాహుబలి పాత్రకు సంబంధించిన మైనపు విగ్రహం ఒకటి తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఇది అనుమతి తీసుకుని చేసిన పని కాదు. మాకు తెలియకుండా, మా దృష్టికి తీసుకురాకుండా బొమ్మను తయారు చేసి పెట్టారు. విగ్రహాన్ని తొలగించేలా తగిన చర్యలు తీసుకుంటాం’’ అని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు.

Latest News
 
ఓపెన్ అయ్యిన 'ఇట్స్ కంప్లికేటేడ్' అడ్వాన్స్ బుకింగ్స్ Sat, Feb 08, 2025, 08:47 PM
లెహంగాలో కళ్లు చెదిరేలా మెరిసిపోతున్న కృతి శెట్టి Sat, Feb 08, 2025, 08:02 PM
త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా : కన్నడ నటుడు దర్శన్‌ Sat, Feb 08, 2025, 07:37 PM
'అఖండ 2' ఫస్ట్ లుక్ విడుదల అప్పుడేనా? Sat, Feb 08, 2025, 06:49 PM
'నిలవకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..! Sat, Feb 08, 2025, 06:43 PM