పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్‌ నటి

by సూర్య | Tue, Sep 26, 2023, 01:10 PM

బాలీవుడ్‌ నటి స్వరా భాస్కర్‌ కి సెప్టెంబర్‌ 23న కూతురు పుట్టినట్లు ఆమె భర్త ఫహద్‌ అహ్మద్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమెకు రబియా అనే పేరు కూడా పెట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ జంటకు అభిమానులు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్వరా భాస్కర్‌ ఈ ఏడాది జనవరిలో ముంబయికి చెందిన రాజకీయ నాయకుడు ఫహద్‌ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్నారు. జూన్‌లో బేబిబంప్‌ ఫొటోలను షేర్‌ చేసి తల్లి కానున్నట్లు తెలిపారు. తాజాగా బిడ్డ ఫొటోలను షేర్‌ చేసి శ్రేయోభిలాషుల ‘పార్థనలు ఫలించాయి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ‘మధోలాల్‌ కీప్‌ వాకింగ్‌’ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన స్వరా భాస్కర్‌ ‘గుజారిష్‌’, తను వెడ్స్‌ మను, రాంజానా, తను వెడ్‌ మను రిటర్న్స్‌, ప్రేమ్‌ రతన్‌ దన్‌పాయో చిత్రాలతో చక్కని విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆమె నటించిన ‘మిసెస్‌ ఫలాని’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Latest News
 
కాంతారా-2’ చిత్రబృందం ప్రయాణిస్తున్న పడవ బోల్తా Sun, Jun 15, 2025, 11:30 AM
‘ఫాదర్స్ డే’: నా దేవుడికి శుభాకాంక్షలు: అల్లు అర్జున్ Sun, Jun 15, 2025, 11:23 AM
పెళ్లి రూమర్.. స్పందించిన అనిరుధ్ Sat, Jun 14, 2025, 08:33 PM
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్ Sat, Jun 14, 2025, 07:19 PM
'కుబేర' ట్రైలర్ విడుదల వాయిదా Sat, Jun 14, 2025, 07:15 PM