స్టార్ హీరో తదుపరి చిత్రానికి రన్‌టైమ్ లాక్

by సూర్య | Mon, Mar 27, 2023, 08:46 PM

గత సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'దృశ్యం 2' తో అజయ్ దేవగన్ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు. తాజగా ఈ స్టార్ హీరో తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'భోలా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ కైతీకి అధికారక రీమేక్. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుని సెన్సార్ బోర్డ్ నుండి U/A సర్టిఫికేట్ పొందినట్లు సామాచారం. అంతేకాకుండా ఈ సిఎంమా 144 నిమిషాలు (2 గంటల 24 నిమిషాలు) రన్ టైమ్ ని కలిగి ఉంది అని లేటెస్ట్ టాక్. ఈ యాక్షన్ డ్రామాలో టబు, అమలా పాల్, దీపక్ డోబ్రియాల్, సంజయ్ మిశ్రా, గజరాజ్ రావు మరియు వినీ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


ఈ చిత్రం మార్చి 30న IMAX 3D ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అజయ్ దేవగన్ ఎఫ్ ఫిల్మ్స్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్, టి-సిరీస్ మరియు రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ బిగ్గీని నిర్మిస్తున్నాయి.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM