by సూర్య | Thu, Mar 23, 2023, 05:11 PM
"పెళ్లి సందడి" సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హలో చెప్పిన యంగ్ అండ్ ట్యాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల. ఆ సినిమా జయాపజయాల గురించి పక్కన పెడితే, శ్రీలీలకు మాత్రం చాలా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వరస తెలుగు చిత్రాలలో ఆమెకు అవకాశాలు దక్కాయి.
ప్రస్తుతం శ్రీలీల NBK 108 లో ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఒక మీడియా ఇంటిరాక్షన్ లో శ్రీలీల మాట్లాడుతూ.. బాలయ్యతో పనిచెయ్యడం పై తన ఎక్జయిట్మెంట్ ని షేర్ చేసుకుంది. బాలయ్యకు తాను డైహార్డ్ ఫ్యాన్ అని, ఆయనతో కలిసి పని చేస్తున్న దగ్గర నుండి వీరాభిమానిని అయిపోయానని, ఈ సినిమాలో తన రోల్ ఆడియన్స్ కి బిగ్ సర్ప్రైజ్ అని చెప్పుకొచ్చింది.
Latest News