వైరల్ పిక్ : ఒకే ఫ్రేమ్ లో ధరణి, రావణాసుర ..!!

by సూర్య | Thu, Mar 23, 2023, 05:10 PM

టాలీవుడ్ లో సెల్ఫ్ మేడ్ స్టార్లుగా పేరెన్నికగన్న నటులు మాస్ రాజా రవితేజ, నాచురల్ స్టార్ నాని. వీరిద్దరి అప్ కమింగ్ మూవీలు రావణాసుర, దసరా ఒక వారం తేడాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రావణాసుర, ధరణి ..అదేనండి రవితేజ, నాని కలిసి ఒక వినూత్న ప్రచార కార్యక్రమానికి తెరతీశారు.


రవితేజ, నాని కలిసి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొనబోతున్నారు. అందులో ఒకరి మూవీ విశేషాలు మరొకరితో పంచుకోబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవితేజ, నానీల పిక్స్ సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్నాయి. మరి, అతి త్వరలోనే మంచి శుభదినం నాడు ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


పోతే, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా దసరా మార్చి 30న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుండగా, మాస్ రాజా రవితేజ, దర్శకుడు సుధీర్ వర్మ కలయికలో విభిన్న కధాంశంతో రూపొందిన రావణాసుర ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Latest News
 
100M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వరరావు' హిందీ వెర్షన్ Tue, May 14, 2024, 04:32 PM
'డబుల్ ఇస్మార్ట్' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Tue, May 14, 2024, 04:30 PM
'ఆ ఒక్కటి అడక్కు' నార్త్ అమెరికా లేటెస్ట్ గ్రాస్ ఎంతంటే...! Tue, May 14, 2024, 04:28 PM
'కుబేర' లో నాగార్జున పాత్రపై లేటెస్ట్ బజ్ Tue, May 14, 2024, 04:27 PM
బజ్ - బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టనున్న వంశీ పైడిపల్లి Tue, May 14, 2024, 04:24 PM