by సూర్య | Mon, Jan 30, 2023, 09:49 PM
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ మూవీ కోసం లోకేష్ చేసిన విధంగానే ఈ చిత్రం టైటిల్‌ను చిన్న ప్రోమోతో ప్రకటిస్తారని బజ్ ఉంది. అప్పట్లో విక్రమ్ వీడియో గ్లింప్సె చిత్రంపై భారీ హైప్‌ను సృష్టించింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, తళపతి67 వీడియో గ్లింప్సె ఫిబ్రవరి 3న విడుదల కానుంది అని కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరి ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ల భాగమేనా అనేది చూడాలి.
ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.
Latest News