పెళ్లి తేదీని వెల్లడించిన మంజిమా మోహన్, గౌతమ్ కార్తీక్‌

by సూర్య | Thu, Nov 24, 2022, 05:52 PM

సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ లో మంజిమా మోహన్ తన టాలెంట్ తో మంచి పేరు సంపాదించుకుంది. ఆమె మలయాళ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది. "సాహసం శ్వాసగా సాగిపో" సినిమాతో ఈ బబ్లీ బ్యూటీ టాలీవుడ్ మూవీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె కథానాయకుడు, మహానాయకుడు సినిమాలలో కూడా నటించింది.


తాజాగా  అలనాటి నటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ మరియు హీరోయిన్ మంజిమా మోహన్ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు. 2019లో రిలీజ్ అయినా "దేవరత్తం" సినిమాలో ఈ లవర్ బర్డ్స్ వర్క్ చేసారు. తాజాగా ఈ రోజు జరిగిన ప్రెస్‌ ఇంటరాక్షన్‌లో, ఇద్దరూ నవంబర్ 28న చెన్నైలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. మంజిమ మరియు గౌతం కార్తీక్ తమ వివాహం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ గా జరుగుతుందని చెప్పారు. పెళ్లయిన తర్వాత కూడా సినిమాలకు సంబంధించిన పనిని కొనసాగిస్తామని ఈ జంట తెలిపింది.

Latest News
 
'గుంటూరు కారం' సెకండ్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Sat, Dec 09, 2023, 08:36 PM
నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $10 మిలియన్ క్లబ్ లో చేరిన 'యానిమల్' Sat, Dec 09, 2023, 08:34 PM
రేపు విడుదల కానున్న 'నాసామిరంగ' ఫస్ట్ సింగిల్ Sat, Dec 09, 2023, 08:32 PM
'నేరు' ట్రైలర్ అవుట్ Sat, Dec 09, 2023, 08:24 PM
'యానిమల్' హిందీ వెర్షన్ లేటెస్ట్ కలెక్షన్స్ Sat, Dec 09, 2023, 08:13 PM