సమంత ఆరోగ్యంపై వైరల్ అవుతున్న పుకార్లు ..నిజమిదే

by సూర్య | Thu, Nov 24, 2022, 03:16 PM

క్రేజీ హీరోయిన్ సమంత మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధికి సమంత ఖరీదైన చికిత్స తీసుకుంటూ ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటుంది. రీసెంట్గానే ఆమె నటించిన యశోద థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది.


అయితే, తాజాగా సమంత అనారోగ్యంతో మరొకసారి హాస్పిటల్ లో చేరిందంటూ సోషల్ మీడియాలో కొంతసేపటి క్రితం వరకూ విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ మేరకు getwellsoonsam అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యింది. ఇది గమనించిన సమంత కేర్ టేకింగ్ టీం ఆమె ఆరోగ్యంపై మీడియాలో స్ప్రెడ్ అవుతున్న న్యూస్ కేవలం రూమర్స్ మాత్రమే వాటిలో ఎలాంటి నిజం లేదు అని పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటుందని, ఆమె ఆరోగ్యంగా, ఫిట్ గా ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారిపై ఇలాంటి రూమర్లు రావడం నిజంగా బాధాకరం అంటూ.. సామ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Latest News
 
ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!! Tue, Dec 06, 2022, 09:11 AM
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM