బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద "దృశ్యం 2"మ్యాజికల్ కలెక్షన్స్

by సూర్య | Wed, Nov 23, 2022, 08:05 PM

అజయ్ దేవగణ్, శ్రేయా శరణ్, టబు, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం "దృశ్యం 2". మలయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం 2 కి అఫీషియల్ హిందీ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. మలయాళం, తెలుగు భాషలలో డైరెక్ట్ ఓటిటి రిలీజైన దృశ్యం 2 హిందీలో మాత్రం ధియేటర్ రిలీజ్ అయ్యింది. ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ కు హిందీ ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.


నవంబర్ 18న విడుదలైన దృశ్యం 2 ఒక వారం కూడా పూర్తి కాకముందే 86 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. చూస్తుంటే తొలివారంలోనే దృశ్యం 2 మూవీ వంద కోట్ల మైలురాయిని చేరుకునేలా కనిపిస్తుంది.


ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ డైరెక్టర్ కాగా, పనోరమా స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్ నిర్మించారు.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM