అతిత్వరలోనే "పఠాన్" ఫస్ట్ సింగిల్ అప్డేట్ ..!!

by సూర్య | Wed, Nov 23, 2022, 08:09 PM

షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పఠాన్ టీజర్ కు ప్రేక్షకాభిమానుల నుండి విశేషస్పందన దక్కింది. చాన్నాళ్ల తరవాత షారుఖ్ నుండి రాబోతున్న చిత్రం అదికూడా... పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, టీజర్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో... పఠాన్ పై అంతటా ఆసక్తి నెలకొంది.


వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతున్న పఠాన్ మూవీ నుండి అతి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుందని పేర్కొంటూ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ రవిజయాని ట్వీట్ చేసారు. నవంబర్ 25న ఇందుకు సంబంధించి అఫీషియల్ అప్డేట్ రాబోతుందని టాక్.


సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్నారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM