by సూర్య | Tue, Oct 04, 2022, 08:23 PM
మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి "గాడ్ ఫాదర్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా మలయాళంలో "లూసిఫర్" సినిమాకు రీమేక్. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గాడ్ ఫాదర్ సినిమా నైజాం రైట్స్ 21 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5, 2022న తెలుగు మరియు హిందీలో విడుదల కానుంది. పొలిటికల్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.