భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ధనుష్ 'రాయన్' మూవీ.....

by సూర్య | Sat, Jul 27, 2024, 01:15 PM

తమిళ సూపర్ స్టార్ ధనుష్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం రాయన్. సిస్టర్ సెంటిమెంట్‌తోపాటు యాక్షన్, డ్రామాగా రూపొందిన చిత్రంలో సందీప్ కిషన్, అపర్ణ బాలకృష్ణన్, ఎస్ జే సూర్య తదితరులు నటించారు. తమిళ నాడులో అగ్ర సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా జూలై 26వ తేదీన రిలీజైంది. రాయన్ సినిమాను చాలా మంది అగ్ర నటులతో, ఏఆర్ రెహ్మాన్ లాంటి టెక్నిషియన్స్‌తో రూపొందించడంతో బడ్జెట్ భారీగా అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ మూవీని యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్‌తో కలిపి సుమారుగా 90 కోట్ల రూపాయలు అయిందని పేర్కొన్నారు.


ధనుష్ దర్శకత్వం వహించడంతో బిజినెస్ భారీగానే జరిగింది. ఇక మూవీ తొలి రోజున భారీగా ఓపెనింగ్స్ సాధించింది. తమిళంలో ఈ సినిమా 9 కోట్ల గ్రాస్, ఇండియాలో 13 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌ అంతా కలుపుకొని ఈ మూవీ సుమారుగా 18 నుంచి 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా యొక్క రెండవ రోజు కూడా మంచి కాలెక్టీన్స్ రాబడుతునట్టు సమాచారం.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM