ముంబైలో "లైగర్" స్పెషల్ ప్రీమియర్ ..?

by సూర్య | Sat, Aug 13, 2022, 08:05 PM

"లైగర్" మూవీని నార్త్ లో, బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సమర్పిస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాలకు బిగ్ రేంజ్ లో ప్రమోషన్స్ చేసే కరణ్ ఈ మూవీ ప్రమోషన్స్ ను కూడా ఫుల్ స్వింగ్ లో కానిస్తున్నాడు. ఫ్యాన్ డమ్ టూర్ పేరిట లైగర్ ప్రమోషన్స్ కు ఒక షెడ్యూల్ ను కూడా ప్రిపేర్ చేసి, ఆ విధంగా రోజుకొక స్టేట్ లో లైగర్ ప్రమోషన్స్ ను జరిపిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, కరణ్ తన బాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం లైగర్ మూవీని స్పెషల్ ప్రీమియర్ వేయనున్నాడట. అదికూడా రిలీజ్ కు ఒకరోజు ముందు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ స్పెషల్ ప్రీమియర్ ముంబైలో ఆగస్టు 24వ తేదీ జరగనుంది. ఐతే, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.   
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM