కార్తికేయ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్

by సూర్య | Sat, Aug 13, 2022, 07:46 PM

చందు మొండేటి - నిఖిల్ సిద్దార్ధ్ కాంబినేషన్ లో 2014లో వచ్చిన చిత్రం "కార్తికేయ" కు సీక్వెల్ గా తెరకెక్కిన "కార్తికేయ 2" ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు నుండి భారీ అంచనాలున్న ఈ మూవీ తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మూవీ టీం మొత్తం ఒకచోట చేరి విజయాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన "కాశ్మీర్ ఫైల్స్" మేకర్స్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ మూవీని నిర్మిస్తుండడం నార్త్ లో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసేలా చేసింది. అంతేకాక ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ఉండడంతో ఈ మూవీ పై అటు నార్త్ లోను, ఇటు సౌత్ లోను మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్యమీనన్, శ్రీనివాస రెడ్డి, వైవా హర్ష కీలకపాత్రల్లో నటించారు.

Latest News
 
ప్రదీప్ రంగనాథన్ తదుపరి చిత్రానికి టైటిల్ ఖరారు Mon, May 06, 2024, 09:02 PM
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' గురించిన తాజా అప్‌డేట్ Mon, May 06, 2024, 09:00 PM
'బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్' తెలుగు ట్రైలర్ అవుట్ Mon, May 06, 2024, 08:53 PM
'రాయన్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Mon, May 06, 2024, 08:49 PM
డిజిటల్ భాగస్వామిని లాక్ చేసిన 'రజాకార్' Mon, May 06, 2024, 08:47 PM