"లైగర్" తో విజయ్ ఖాతాలో క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులు?

by సూర్య | Sat, Aug 13, 2022, 08:21 PM

'లైగర్' విడుదల కాకుండానే విజయ్ దేవరకొండ నార్త్ లో ఫుల్ హవా చూపిస్తున్నాడు. ఉత్తరాది రాష్ట్రాలలో లైగర్ ప్రమోషన్స్ కు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది. మేకర్స్ కూడా ఈ మూవీ సక్సెస్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఉత్తరాదిన విజయ్ క్రేజ్ ను బట్టి వరస హిందీ అవకాశాలు వచ్చి ఉంటాయని, అఫీషియల్ ఎనౌన్స్ రావడమే ఆలస్యమని చాలామంది అనుకుంటున్నారు.
నిజానికి విజయ్ లైగర్ తప్ప ఏ డైరెక్ట్ హిందీ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కథలు వింటున్నా తనను థ్రిల్ చేసిన, ఎక్జయిటింగ్ కు గురి చేసిన స్టోరీ ఐతే ఇప్పటివరకు తనదరి చేరలేదట. దీంతో ముందుగా లైగర్ ను రిలీజ్ చేసి, ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేసి కొన్ని నెలల తరవాత కథలు వినాలని ప్లాన్ చేస్తున్నాడట.
లైగర్ హిట్టయితే బాలీవుడ్ లో విజయ్ క్రేజ్ మరింత పెరగడం, స్టార్ హీరో రేంజ్ ను పొందడం ఖాయమని రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పోతే, ఈ చిత్రం ఆగస్టు 25న పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.    

Latest News
 
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'RRR' Fri, Apr 19, 2024, 06:04 PM
'ప్రతినిధి 2' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:02 PM
'అరణ్మనై 4' UK అండ్ యూరప్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Fri, Apr 19, 2024, 06:00 PM