రవితేజ తప్పుకోవడంతో... నానాతంటాలు పడుతున్న మెగా154 మేకర్స్

by సూర్య | Thu, Jul 07, 2022, 03:56 PM

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" తో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం అందరికి తెలిసిందే. దీంతో తదుపరి ప్రాజెక్టులైన గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా 154 సినిమాలపై చిరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారట.
కే ఎస్ రవీంద్ర డైరెక్షన్లో మెగాస్టార్ "వాల్తేరు వీరయ్య" అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయి. పోతే..., ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందంట. ముందుగా ఆ పాత్రకు మాస్ మహారాజా రవితేజను అనుకున్నారు కానీ, ఆయన తప్పుకోవడం వల్ల ఇప్పుడు మేకర్స్ ఆ పాత్ర పోషించే నటుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారట. తెలుగులోనే కాక తమిళ, మలయాళ, కన్నడ భాషలలో ఈ పాత్రకు సరిపోయే నటుడిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని మేకర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారట. మెగా 154 మేకర్స్ రవితేజ రిజెక్ట్ చేసిన రోల్ ను ఏ ప్రముఖ నటుడితో నటింపచేస్తారో అని మెగా అభిమానులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM