దసరా సంబరాలతో మొదలవనున్న "ఆదిపురుష్" ప్రమోషన్స్ ..!

by సూర్య | Thu, Jul 07, 2022, 03:58 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో, మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం "ఆదిపురుష్". ఓం రౌత్ - అజయ్ దేవగణ్ కాంబోలో వచ్చిన తాన్హాజి ఉత్తరాదిన ఘనవిజయం సాధించింది. తాన్హాజి తదుపరి ఓం రౌత్ చేసున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రభాస్ రాఘవ పాత్రలో, కృతిసనన్ జానకి పాత్రలో, సైఫ్ అలీఖాన్ లంకేష్ పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. రూ. 500కోట్ల బడ్జెట్ తో టి సిరీస్, రెట్రోఫిల్స్ సంస్థలు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్నాయి. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.
ఈ మూవీపై వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ ఏడాది దసరా పండగ సందర్భంగా ఆదిపురుష్ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతుందట. ఇక అప్పటి నుండి ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసి, సినిమాపై భారీ హైప్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు చెయ్యబోతున్నారంట. పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ లో కూడా విడుదలవబోతున్న ఈ మూవీకి దసరా నుండి ప్రమోషన్స్ చెయ్యటం చాలా కరెక్ట్ అని అంటున్నారు. ఐతే, ఈ విషయం పై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM