బుల్లితెరపై కూడా "రాధేశ్యామ్" కు నిరాశే ... డీలాపడ్డ డార్లింగ్ ఫ్యాన్స్

by సూర్య | Thu, Jul 07, 2022, 03:54 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్టుతో ఈ సినిమాను నిర్మించారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అందమైన ప్రేమ కథ ఇటీవల విడుదలై భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. ప్రభాస్ నుండి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ను కోరుకునే ప్రేక్షకులకు ఈ క్లాస్ లవ్ ఎంటర్టైనర్ అంతగా నచ్చలేదనే చెప్పాలి. కానీ ప్రభాస్ అభిమానులకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేసింది.
థియేటర్లలో ఉసూరుమనిపించిన రాధేశ్యామ్ ఓటిటిలో ఫర్వాలేదనిపించింది. కానీ, బుల్లితెరపై మళ్ళీ ఉసూరుమనిపించింది. జూన్ 26వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు జీ తెలుగు ఛానెల్ లో తొలిసారి టెలికాస్ట్ ఐన రాధేశ్యామ్ కు కేవలం 8.25 TRP మాత్రమే వచ్చింది. మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన రీసెంట్ డిజాస్టర్ "కొండపొలం" (12.34)కు రాధేశ్యామ్ కన్నా ఎక్కువ TRP రావడం నిజంగా ప్రభాస్ ఇమేజ్ కు బిగ్ డామేజ్ కలిగించే విషయమని చెప్పాలి. దీనిపట్ల డార్లింగ్ అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Latest News
 
తలపతి విజయతో నటించనున్న త్రిష Mon, Aug 08, 2022, 10:28 PM
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్‌డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM