కళ్ళు చెదిరే మొత్తానికి షారుఖ్ ఖాన్ "జవాన్" డిజిటల్ రైట్స్ అమ్మకం

by సూర్య | Thu, Jul 07, 2022, 03:47 PM

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొలిసారి ఒక సౌత్ డైరెక్టర్ తో కలిసి పని చేస్తున్నారు. వీరి కాంబోలో "జవాన్" అనే సినిమా ఇటీవలే అధికారికంగా ప్రకటింపబడింది. టైటిల్ టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పారు డైరెక్టర్ అట్లీ. ఇందులో షారుఖ్ డ్యూయల్ రోల్ ను పోషిస్తున్నట్టు సమాచారం. తండ్రి పాత్ర షారుఖ్ సరసన దీపికా పదుకొణె, కొడుకు పాత్ర షారుఖ్ కు జోడిగా నయనతార నటిస్తున్నారు.
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఎంత ధరకు జవాన్ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందో తెలుస్తుంది. దాదాపు రూ. 130 కోట్ల హ్యూజ్ ఎమౌంట్ జవాన్ నిర్మాతలకు చెల్లించి మరీ నెట్ ఫ్లిక్స్ ఆ మూవీ హక్కులను కొనుక్కుందట. ఈ మూవీపై ఉన్న క్రేజ్ కు ఇదొక ఉదాహరణ మాత్రమే.

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM