సూపర్ హీరోగా నటించడమే డ్రీం రోల్ అంటున్న ఢిల్లీ బ్యూటీ

by సూర్య | Thu, Jul 07, 2022, 03:45 PM

సౌత్ లో కొన్ని సినిమాలు చేసి ఆపై నార్త్ కు వెళ్లి అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బాగా ఫేమస్ అయ్యింది హీరోయిన్ తాప్సి. తాజాగా ఆమె నటిస్తున్న మరొక లేడీ ఓరియెంటెడ్ చిత్రం "శెభాష్ మిథు".  ఈ సినిమాలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పాత్రను పోషిస్తుంది తాప్సి. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వంలో మిథాలీ రాజ్ బయో పిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 15, జూలై 2022న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న తాప్సి తన డ్రీం రోల్ పై క్లారిటీ ఇచ్చింది. మార్వెల్ సిరీస్ లో బాగా ప్రాచుర్యం పొందిన "అవెంజర్స్" లో సూపర్ హీరోగా నటించడం తన చిరకాల కోరిక అని చెప్పింది. ఆల్రెడీ అవెంజర్స్ లో నటించిన సూపర్ హీరోల పాత్రల్లో కాకుండా, అదే సినిమాలో భారతీయ సూపర్ హీరోగా నటించాలనుందని చెప్పింది.  
సినిమాల విషయానికొస్తే, షారుఖ్ ఖాన్ - రాజ్ కుమార్ హిరాణి కాంబోలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న "డంకీ" మూవీలో తాప్సి ఫిమేల్ లీడ్ రోల్ ను పోషిస్తుంది. బాలీవుడ్లో తాప్సి తొలిసారి ఒక స్టార్ హీరో పక్కన నటిస్తున్న చిత్రమిదే.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM