సందీప్ రెడ్డి వంగా ప్రకటనతో... గాల్లో తేలుతున్న ప్రభాస్ ఫ్యాన్స్

by సూర్య | Thu, Jul 07, 2022, 03:49 PM

గతేడాది అక్టోబర్ లో ప్రభాస్ తన 25 వ సినిమాగా "స్పిరిట్"ను 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్ పాన్ ఇండియా రేంజులో, భారీ బడ్జెట్టుతో ఈ సినిమాను నిర్మించబోతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.
ఎందుకంటే, ప్రభాస్ రాధేశ్యామ్ ప్రమోషన్స్, మోకాలి శస్త్ర చికిత్స ఆపై ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్ సినిమా షూటింగులతో బిజీగా మారడంతో ఈ మూవీపై అంతగా శ్రద్ధ చూపించలేదు. సందీప్ కూడా రణ్ బీర్ కపూర్ తో "యానిమల్" సినిమాను చిత్రీకరిస్తూ, బిజీగా ఉన్నాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ... రణ్ బీర్ తో యానిమల్ సినిమా షూటింగ్ ముగించిన వెంటనే, ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ప్రభాస్ తో స్పిరిట్ ను స్టార్ట్ చేస్తానని డార్లింగ్ అభిమానులకు ఈ ప్రాజెక్ట్ పై నమ్మకాన్ని కలిగించారు. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందో లేదో అని అనుమానంలో ఉన్న ప్రభాస్ అభిమానులకు సందీప్ మాటలు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. మొత్తానికి స్పిరిట్ 2023 లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అర్జున్ రెడ్డి తో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన సందీప్, స్పిరిట్ సినిమాను యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కించబోతున్నారట.

Latest News
 
రౌడీ హీరో హాట్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా? Sat, Aug 13, 2022, 08:33 PM
"లైగర్" తో విజయ్ ఖాతాలో క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులు? Sat, Aug 13, 2022, 08:21 PM
ముంబైలో "లైగర్" స్పెషల్ ప్రీమియర్ ..? Sat, Aug 13, 2022, 08:05 PM
కార్తికేయ 2 సక్సెస్ సెలెబ్రేషన్స్ Sat, Aug 13, 2022, 07:46 PM
వెంకీమామ టాలీవుడ్ ఎంట్రీకి 36 ఏళ్ళు Sat, Aug 13, 2022, 07:38 PM