"సమ్మతమే" డిజిటల్ స్ట్రీమింగ్ కు ముహూర్తం ఖరారు

by సూర్య | Thu, Jul 07, 2022, 10:30 AM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, 'కలర్ ఫోటో' ఫేమ్ చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం సమ్మతమే. ఈ సినిమాతో గోపినాధ్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయమవబోతున్నారు. యూ జి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రఖ్యాత టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీని సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసారు. గీతా ఆర్ట్స్, అల్లుఅరవింద్ ఇమేజ్ ఈ సినిమాకు విజయాన్ని కట్టబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి.
దీంతో మేకర్స్ సమ్మతమే సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు జూలై 15వ తేది నుండి తెలుగు ఓటిటి ఆహా లో సమ్మతమే స్ట్రీమింగ్ కానున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిజిటల్ లో ఈ  సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.

Latest News
 
'భలే ఉన్నాడే' టీజర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ డైరెక్టర్ Sat, May 04, 2024, 08:22 PM
'తమ్ముడు' సెట్స్ లో వేణు శ్రీరామ్‌ పుట్టినరోజు వేడుక Sat, May 04, 2024, 08:20 PM
'ఇండియన్ 2' విడుదలపై లేటెస్ట్ బజ్ Sat, May 04, 2024, 08:18 PM
'పుష్ప 2' పోస్ట్ ప్రొడక్షన్‌లో జాప్యం Sat, May 04, 2024, 08:09 PM
డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని లాక్ చేసిన 'లవ్‌గురు' Sat, May 04, 2024, 08:07 PM