మేలుకోండి.... లైగర్ టీం కు విజయ్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

by సూర్య | Wed, Jun 22, 2022, 07:20 PM

పూరి డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం లైగర్. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. నిజానికి ఈ మూవీ షూటింగును పూరి గతేడాది నవంబర్ లోనే ఫినిష్ చేసారు. లైగర్ ఆగస్టు 25న విడులవుతుందని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా లైగర్ ను రిలీజ్ చెయ్యటానికి పూరి 9నెలల పాటు ఎదురుచూస్తున్నాడు. సినిమా ఆలస్యం కావడానికి ప్రధాన కారణం కరణ్ జోహార్ అని తెలుస్తుంది. ఒక నిర్మాతగా ఈ మూవీలో కరణ్ ఎక్కువగా ఇన్ వాల్వ్ అయ్యారని, సినిమాను భారీ రేంజులో విడుదల చెయ్యటానికి తగిన ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
ఇదిలావుంటే, ఆ మధ్య లైగర్ థీమ్ మ్యూజిక్ పేరిట విడుదల చేసిన వీడియోకు ప్రేక్షకాభిమానుల నుండి విశేష స్పందన వచ్చింది. అప్పటినుండి ఈ సినిమా పై లేటెస్ట్ అప్డేట్ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులు కోరుకుంటున్నట్టు ఈ మూవీపై అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో విసిగిపోయిన విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో లైగర్ టీం కు మేలుకోమని, సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే బ్రహ్మాస్త్ర వరస అప్డేట్లనిస్తూ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేసిందని, మీరు కూడా అలా చెయ్యండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట.

Latest News
 
చేతినిండా సినిమాలున్నా ... సంతృప్తి చెందని "పెళ్లి సందడి" బ్యూటీ Fri, Jul 01, 2022, 11:00 AM
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM