అన్న చేతుల మీదుగా తమ్ముడి కొత్త సినిమా

by సూర్య | Wed, Jun 22, 2022, 06:28 PM

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన అన్నదమ్ములు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. మెగా ఇమేజ్ తో చిత్రసీమలో దూసుకుపోతున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు ప్రస్తుతం వరస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకుని ఈ మధ్యనే తన కొత్త సినిమాను స్టార్ట్ చేసాడు తేజ్. వైష్ణవ్ విషయానికొస్తే..., ఆయన నటించిన కొత్త సినిమా రంగరంగ వైభవంగా జూలై 1వ తేదీన విడుదలవడానికి రెడీ అవుతుంది. ఈ క్రమంలో వైష్ణవ్ మరో సినిమాను ప్రకటించాడు.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజే జరిగింది. పూజా కార్యక్రమాలతో ఈ రోజే లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ వైష్ణవ్ కు నాలుగో సినిమా. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమవబోతున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హీరోహీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వైష్ణవ్ అన్నయ్య, సాయిధరమ్ తేజ్ క్లాప్ నిచ్చారు. ఈ ఫోటోలను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Latest News
 
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM
బుల్లితెర టీఆర్పీ రేటింగుల్లో "పుష్ప"దే పైచేయి ..! Fri, Jul 01, 2022, 10:21 AM
రేపు రిలీజ్ కానున్న 'ఏనుగు' మూవీ Thu, Jun 30, 2022, 11:36 PM
మా ఇద్దరు మధ్య ఉంది స్నేహ బంధం మాత్రమే : సీనియర్ నటుడు నరేష్ Thu, Jun 30, 2022, 11:19 PM