రౌడీ స్టార్ కి సూపర్ సీనియర్‌గా కనిపించనున్న సమంత

by సూర్య | Sat, May 21, 2022, 12:16 PM

టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంత రూత్ ప్రభు జంటగా కనిపించనుంది. మూవీ మేకర్స్ ఈ సినిమాకి 'ఖుషి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ లో లీడ్ పెయిర్ మధ్య కొన్ని క్యూట్ రొమాంటిక్ స్కీన్స్ ఉంటాయి అని లేటెస్ట్ టాక్. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో సమంత 'రౌడీ' హీరోకి సూపర్ సీనియర్ పాత్రలో నటిస్తుందని సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రేసర్‌గా కనిపించనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 23, 2022న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.

Latest News
 
శబరి నుండి 'అనగనగా ఒక కధల' సాంగ్ విడుదలకి తేదీ లాక్ Fri, Apr 26, 2024, 11:31 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్‌కి డబ్బింగ్ పూర్తి చేసిన విశ్వక్ సేన్ Fri, Apr 26, 2024, 11:10 PM
'తంగలన్' గురించి కీలక అప్‌డేట్‌ను వెల్లడించిన సంగీత దర్శకుడు Fri, Apr 26, 2024, 11:05 PM
'కల్కి 2898 AD' విడుదల అప్పుడేనా? Fri, Apr 26, 2024, 11:01 PM
రీ-రిలీజ్ రికార్డు...టాప్ ప్లేస్ లో దళపతి విజయ్ 'గిల్లీ' Fri, Apr 26, 2024, 08:50 PM